దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం - TASC తన 55వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థుల్లో ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. ‘టాస్క్ 2026 యూత్ రాపిడ్ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్’ పేరుతో జరుగనున్న ఈ పోటీని చెస్ క్లబ్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ టోర్నమెంట్ మే 16, 2026 శనివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. పోటీలో పాల్గొనదలిచిన విద్యార్థులు మే 15, 2026లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులను ఐదు విభాగాలుగా విభజించారు. కిండర్ గార్డెన్, ప్రైమరీ స్కూల్ (గ్రేడ్ 1-3), ఎలిమెంటరీ స్కూల్ (గ్రేడ్ 4-5), మిడిల్ స్కూల్ (గ్రేడ్ 6-8), హై స్కూల్ (గ్రేడ్ 9-12) కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు.

టాస్క్ ప్రెసిడెంట్ కొండల రావు, ప్రెసిడెంట్ ఎలక్ట్ వేణు రెడ్డి , సెక్రటరీ శంకర్ సింగంశెట్టి, ట్రెజరర్ మహేష్ నూకల సహా కార్యవర్గ సభ్యులు టోర్నమెంట్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ప్రతి విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఆకర్షణీయమైన ట్రోఫీలను ప్రదానం చేయనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు https://online.chessklub.com/tasc లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు కోరారు.

tasc chess tournment.png