అమెరికాలో భక్తి జ్వాలలు రగిలించేందుకు ఓ అద్భుత ఆధ్యాత్మిక కార్యక్రమం సిద్ధమవుతోంది. సనాతన్ ఆధ్వర్యంలో “హర హర మహాదేవ” అనే విశిష్ట ఆధ్యాత్మిక నాట్య రూపక కావ్యం, 2026 ఆగస్టు 1న న్యూ జెర్సీలో భక్తుల ముందుకు రానుంది.

“Experience The Divine Energy” అనే థీమ్‌తో రూపొందించిన ఈ కార్యక్రమం, భక్తి, నృత్యం, సంగీతం కలయికగా మహాదేవుని మహిమను అద్భుతంగా ప్రతిబింబించనుంది. “Live, Grand, Legendary” గా ఈ వేడుక ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పనుంది.

ఈ ప్రదర్శనలో శివపురాణంలోని ముఖ్య ఘట్టాలను వినూత్నంగా ఆవిష్కరించనున్నారు.లింగోద్భవం నుంచి దక్షయజ్ఞం వరకు, పార్వతి కళ్యాణం నుంచి గంగావతరణం వరకు,

గజాసుర సంహారం, రావణ దర్పభంగం వంటి విశేష ఘట్టాలు ఇవి అన్నీ ఒకే వేదికపై, అత్యాధునిక ప్రదర్శనతో, భక్తి భావంతో ప్రేక్షకులకు అందించబడనున్నాయి. తెలుగు భక్తి సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఈ మహత్తర ప్రయత్నం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపనుంది.ఈ పవిత్ర యజ్ఞం విజయవంతం కావాలని, శివుని కృపాకటాక్షాలు అందరికీ లభించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.