అమెరికాలోని తెలుగు క్రీడాభిమానులకు శుభవార్త. మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన ‘మాటా వాలీబాల్ టోర్నమెంట్ 2026 ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 23వ తేదీ (శనివారం) ఉదయం 8 గంటలకు మిచిగాన్ రాష్ట్రంలోని నోవీ నగరంలో ఉన్న SPARC ఎరీనా వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి.

ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకునే జట్లకు మే 21, 2026 వరకు నమోదు గడువు విధించారు. రిజిస్ట్రేషన్ ఫీజు $180గా నిర్ణయించారు. ఫిలడెల్ఫియాలో జూన్ 19 నుంచి 20 వరకు జరగనున్న ‘మాటా 2వ మహాసభల’ ప్రచారంలో భాగంగా ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు.

తెలుగు కమ్యూనిటీలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా, ఐక్యతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో జట్లు పాల్గొని ఈ క్రీడా వేడుకను విజయవంతం చేయాలని ‘మాటా’ కార్యవర్గం పిలుపునిచ్చింది.