మధురై మీనాక్షీ ఆలయంలో ఈ ఏడాది చిత్తిరై తిరువిళా వేడుకలు ఘనంగా కొడియేట్రంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మధురై మీనాక్షి ఆలయంలో పట్టాభిషేకం, తిరు కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. దేశ,విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్త జనసందోహం నడుమ మీనాక్షీ సుందరేశ్వరులు పరిణమాడారు.

cithirai1.jpg

మీనాక్షి అమ్మవారు.. మదురై రాణిగా పట్టాభిషేకం పొందిన తర్వాత ఈ వివాహం జరిగింది. మదురై మీనాక్షి అమ్మవారి పట్టాభిషేకం ఏప్రిల్ 26న చిత్తిరై ఉత్సవాలలో భాగంగా ఘనంగా జరిగింది. మీనాక్షి దేవిని మదురై నగర రాణిగా అభిషేకిస్తూ, వజ్రాల కిరీటం, నవరత్న సెంగోల్‌తో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేకం తర్వాత, ఆమె దిగ్విజయ యాత్రకు బయలుదేరి, సుందరేశ్వరుని అంటే శివున్ని వివాహం చేసుకుంటుంది.

cithirai2.jpg

తిరుకల్యాణం తర్వాత మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహాలను పుష్ప పల్లక్కి, గజ వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులు భక్తులను ఆకర్షించాయి. ఆలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు మే 5 వరకు కొనసాగనున్నాయి. ఇందులో కళ్ళజగర్ వైగై నదిలో దిగడం వంటి ఇతర ముఖ్య ఘట్టాలు ప్రత్యేకతను చాటుకుంటాయి.