హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం ప్రారంభమైనా మొదట పూజించేది వినాయకుడినే. గణపతి పూజతోనే ఏ పూజైనా, నోమైనా, వ్రతమైనా, పండగైనా జరపుకుంటారు. ఎందుకు ఫస్ట్‌ గణపతినే పూజిస్తారు. ఎందుకంటే ఆయనే విఘ్నేశ్వరుడు… అడ్డంకులను తొలగించే దేవుడు.

పురాణాల ప్రకారం, తన తెలివితో తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసిన గణపతికి, పరమశివుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. అదే... ఏ పూజైనా, ఏ కార్యమైనా మొదట గణపతిని పూజిస్తే అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుందని.

అంతేకాదు, గణపతి ఓంకార స్వరూపుడు. ఓం అనేది సృష్టికి మూలం. ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. అందుకే గణపతిని ముందుగా స్మరించడం అనేది శాస్త్రసమ్మతం.

గణపతి అంటే గణాల అధిపతి — సృష్టిలోని అన్ని శక్తుల నాయకుడు. మన పని విజయవంతం కావాలంటే ఆయన ఆశీస్సులు అవసరం.

యోగశాస్త్రం ప్రకారం కూడా మూలాధార చక్రంలో గణపతికి స్థానం ఉంది. అందుకే ప్రతి ప్రారంభానికి ఆయనను ఆరాధించడం ఒక పవిత్ర సంప్రదాయం.

కాబట్టి… “శుక్లాంబరధరం విష్ణుం…” అంటూ వినాయకుడిని స్మరించి, ప్రతి పనిని విజయవంతంగా ప్రారంభిద్దాం.

https://api.todaytelugu.net/media/2026/04/47e8dc8f3fab66c75b4601d3c966b945.webp