రాకుల్ ప్రీత్ సింగ్ తన మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో ధ్యానం (Meditation) మరియు యోగా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆమె 2018–19 సమయంలో ధ్యానం పరిచయమైందని, అప్పటి నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే విధానం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.
“2018–19లోనే నాకు ధ్యానం పరిచయమైంది. అంతకుముందు నేను చాలా హైపర్ పర్సన్‌గా ఉండేదాన్ని. ఇప్పటికీ కొంతవరకు అలాగే ఉంటాను కానీ, కల్లోల పరిస్థితుల్లో కూడా ఎలా స్థిరంగా ఉండాలో నేర్చుకున్నాను. ఇది నాకు గ్రౌండింగ్ ఫ్యాక్టర్‌లా పనిచేస్తుంది. రోజంతా నేను దీన్ని కొనసాగిస్తుంటాను,” అని ఆమె చెప్పారు.
ధ్యానం అంటే తప్పనిసరిగా ఎక్కువ సమయం కేటాయించడం కాదని, రోజువారీ జీవితంలో చిన్న క్షణాల్లో కూడా దాన్ని పాటించవచ్చని రాకుల్ వివరించారు.
“నాకు 30 నిమిషాలు కూర్చుని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఒత్తిడి ఉన్నట్లు అనిపించినప్పుడు నేను లోతుగా శ్వాస తీసుకుని, ఒక ఉద్దేశాన్ని సెట్ చేసుకుని ముందుకు సాగుతాను,” అని ఆమె తెలిపారు.











