భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యూటివ్ గౌతమ్ రంగరాజన్‌కు బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. యూకే ప్రధాని ఆయనను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్‌కు సంబంధించిన ప్రత్యేక సలహాదారుగా నియమించారు. రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవహారాలపై ఆయన ప్రధానంగా సలహాలు ఇవ్వనున్నారు.
బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉన్న గౌతమ్ రంగరాజన్.. ఇప్పటికే కొత్త బాధ్యతలు స్వీకరించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వ పాలనలో వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కీలక మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఆయన నియామకానికి ప్రాధాన్యత ఏర్పడింది.








