కొలంబియాలో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా.. 570 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
భూకంపం తర్వాత మరోసారి భూమి కంపించే అవకాశం ఉందని కొలంబియన్ జియోలాజికల్ సర్వీస్ హెచ్చరించింది. భూకంపం కారణంగా 1,575 ఇళ్లు, 18 హెల్త్ సెంటర్లు, 52 పాఠశాలలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 61 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా వెల్లడించారు.
“ప్రజలను ఒంటరిగా వదిలిపెట్టము. వారు మా హృదయాల్లో ఉన్నారు. వారి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తాం” అని అధ్యక్షుడు తెలిపారు.
భూకంపం ధాటికి భవనాలు పేకమేడల్లా కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు వందేళ్ల తర్వాత ఇంతటి భారీ భూకంపం సంభవించడంతో పలు పురాతన కట్టడాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.









