జపాన్‌లోని యోకోహామాలో జరిగిన మినాటో మిరాయ్ ఫెస్టివల్ 2026లో బాణాసంచా ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రాత్రి ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతూ.. ఫైర్‌వర్క్స్ ఒక్కోసారి పేలినప్పుడల్లా ఆకాశం మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. అయితే ఈ వేడుకలో గ్రాండ్ ఫినాలే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుసగా పేలిన అద్భుతమైన ఫైర్‌వర్క్స్‌తో యోకోహామా ఆకాశం మొత్తం కాంతులతో నిండిపోయింది.
కళ్లుచెదిరే వెలుగులు, ఆకట్టుకునే రంగులతో సాగిన ఈ ఫైర్‌వర్క్స్ ప్రదర్శనను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. ఫినాలే సమయంలో ఆకాశంలో కనిపించిన అద్భుత దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. మొత్తంగా.. మినాటో మిరాయ్ ఫెస్టివల్ 2026 యోకోహామా రాత్రిని ఓ అద్భుతమైన దృశ్యకావ్యంగా మార్చేసింది!












