నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ జూన్ 5 నుంచి 7 వరకు అధికారిక పర్యటన కోసం న్యూఢిల్లీకి చేరుకుని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. మార్చి 2026లో అధికారంలోకి వచ్చిన ప్రధాని బాలెన్ షా ప్రభుత్వానికి చెందిన మంత్రి భారతదేశాన్ని అధికారికంగా సందర్శించడం ఇదే మొదటిసారి.

ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధన రంగం, ప్రజల మధ్య సంబంధాలు, అభివృద్ధి సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత్-నేపాల్ మధ్య భద్రతా, దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన కీలకంగా భావిస్తున్నారు.

అలాగే కలాపాని-లిపులేఖ్-లింపియాధురా సరిహద్దు వివాదం వంటి పెండింగ్ అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.