అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు, ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదిక Xలో ఆమె తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. జూన్ 30 నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని తెలిపారు.
తన భర్త అబ్రహామ్‌కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడిందని గబ్బార్డ్ పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.







