అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్... తైవాన్ అంశంపై చర్చించారు. గురువారం జరిగిన తొలి చర్చల్లో.. తైవాన్ సమస్యను సరిగ్గా నిర్వహించకపోతే అమెరికా-చైనా సంబంధాలు అత్యంత ప్రమాదకర దశలోకి వెళ్లే అవకాశం ఉందని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.

తైవాన్ అంశం రెండు దేశాల సంబంధాల్లో అత్యంత కీలకమని పేర్కొంటూ.. దీనిపై అమెరికా చైనా అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. లేదంటే రెండు దేశాల మధ్య ఘర్షణలు, వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం జిన్‌పింగ్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.