‘మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు..’ NEET 2026 రీ-టెస్ట్‌కు మరో ఇద్దరు విద్యార్ధులు బలి
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

నీట్ రీటెస్ట్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనతో దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి, తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర కలకలం రేగింది. పేపర్ లీక్ వివాదం కారణంగా మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం వల్ల మానసిక ఒత్తిడికి గురై దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలతో నీట్ పరీక్ష విధానం, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, పరీక్షల ఒత్తిడిపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ ప్రారంభమైంది..
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












