దక్షిణాది చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న త్రిషా కృష్ణన్​ తన 43వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును ఆమె ఎంతో ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. పవిత్ర తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.