ఐపీఎల్ 2026 సీజన్‌ను వరుస ఓటములతో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ముంబై ఇండియన్స్‌పై రెండు విజయాల తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్‌పైనా గెలిచి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో సులభ విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 155/7 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ట్రిస్టన్ స్టబ్స్ 38, సమీర్ రిజ్వీ 40 పరుగులతో కొంత గౌరవప్రదమైన స్కోర్ అందించారు.

156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 17.3 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ సంజూ శామ్‌సన్ అద్భుతంగా 87 పరుగులు చేసి జట్టును విజయంలోకి నడిపించాడు. కార్తీక్ శర్మ 41 పరుగులతో మంచి సహకారం అందించాడు.