ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ క్రికెట్‌లో దూసుకెళ్తున్నాడు. 18 ఏళ్ల రాకీ తాజాగా లాంకాషైర్ తరఫున సమర్‌సెట్‌పై వన్డే కప్‌లో అద్భుత శతకం సాధించాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అతడు.. చివరకు 76 బంతుల్లో 123 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.
రాకీకి ఇది మాత్రమే కాదు.. గతంలోనే తండ్రిని మించిన ఘనత సాధించాడు. 2025లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున క్రికెట్ ఆస్ట్రేలియా XIపై శతకం బాదిన రాకీ.. 16 ఏళ్ల 291 రోజుల వయసులో ఇంగ్లండ్ లయన్స్ తరఫున తొలి సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్ పేరిట ఉండేది. ఆండ్రూ 20 ఏళ్ల 28 రోజుల వయసులో తొలి లయన్స్ సెంచరీ సాధించాడు.
సమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీతో పాటు లాంకాషైర్ ఆటగాడు కీటన్ జెన్నింగ్స్ కూడా సెంచరీతో చెలరేగాడు. జెన్నింగ్స్ 127 బంతుల్లో 156 పరుగులు చేయడంతో లాంకాషైర్ 50 ఓవర్లలో 443/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం సమర్‌సెట్‌ను 174 పరుగుల తేడాతో ఓడించింది.
ఇదిలా ఉండగా, ఆండ్రూ ఫ్లింటాఫ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 23 నెలల పాటు లయన్స్‌కు కోచ్‌గా పనిచేసిన ఫ్లింటాఫ్.. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సీనియర్ జట్టు సహాయక బృందంలోనూ భాగమయ్యాడు.









