తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమవుతున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకుంటున్నారు. అలా తాజాగా ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బోన‌మెత్తింది. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.