రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంక్ డీలర్స్‌కు ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని HPCL, IOCL,BPCL ప్రతినిధులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు.