తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుల కోసం గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించనున్నారు. ఇందుకోసం 200 టీమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టీమ్‌లు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నాయని తెలుస్తోంది.