దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోవచ్చని ఐఎమ్‌డీ హెచ్చరించింది. దీర్ఘకాల సగటు వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది వ్యవసాయం, ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, నీటి వనరులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.