సహజసిద్ధమైన పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న పండు డ్రాగన్ ఫ్రూట్. అందమైన గులాబీ రంగులో, లోపల చిన్న చిన్న నల్లటి గింజలతో ఉండే ఈ పండు కేవలం రుచిలోనే కాదు, అద్భుతమైన ఔషధ గుణాల్లోనూ రారాజు. తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. సూపర్ ఫ్రూట్‌గా పిలిచే ఈ పండును డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.