Indian Cricket Team: క్రికెట్‌లో మార్పులు సహజం. ఒక తరం ముగిసి మరో తరం రావడం ఖాయం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు టీమిండియా యాజమాన్యం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు సీనియర్ ఆటగాళ్లకు చేదు అనుభవమే అయినప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా తప్పనిసరి అనిపిస్తోంది. దేశానికి ఎన్నో సేవలందించిన ఈ నలుగురు దిగ్గజాలకు టీ20ల్లో ఘనమైన వీడ్కోలు లభించకపోవడం మాత్రం అభిమానులను కాస్త కలచివేసే విషయమే.