అజీర్తి, కడుపుబ్బరం, అలసట.. ఈ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని పుదీనా. శరీరానికి సహజసిద్ధమైన తాజాదనాన్ని అందిస్తూ, ఒత్తిడిని తగ్గించడంలో దీనికి సాటిలేదు. ఒక్కసారి ఇంట్లో నాటుకుంటే ఏడాదంతా తాజాగా అందుబాటులో ఉండే ఈ మూలికను కుండీలలో ఎలా పెంచాలో, దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.