Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్ ఇవే!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు శరీరానికి సరిపడా ప్రోటీన్ అందించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి ఉదయాన్నే తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. ప్రొటీన్ అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది గుడ్లు లేదా మాంసాహారం మాత్రమే. అయితే, శాఖాహారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని లేదా గుడ్లు తింటేనే ఎక్కువ ప్రోటీన్ వస్తుందని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. మన ఇంట్లోని పప్పు ధాన్యాలు, పనీర్, సత్తు పిండి వంటి సంప్రదాయ ఆహార పదార్థాల్లో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఫైబర్ దాగి ఉన్నాయి. సగటున 60 నుండి 70 కిలోల బరువున్న వ్యక్తికి రోజూ కనీసం 50 నుండి 60 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










