యోగాంధ్ర సంబరం.. సీఎం చంద్రబాబుతో కలిసి బాబా రాందేవ్ యోగాసనాలు.. కోటి మందితో రికార్డు లక్ష్యం!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ హాజరుకానున్నారు. ఈ నెల 20న ఉండవల్లి గుహల వద్ద సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రత్యేక యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 21న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 33 వేల కేంద్రాల్లో దాదాపు కోటి మందితో యోగా చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Advertisement
Advertisement
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













