భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా ఇలాంటి లేఖలు వస్తున్నప్పటికీ గంగూలీ దంపతులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల వరుసగా బెదిరింపు లేఖలు రావడంతో సౌరభ్ గంగూలీ పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేసి, బెదిరింపు లేఖలు రాస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిస్తున్నారు? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో గంగూలీ దంపతుల భద్రతపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.









