సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు GR IAS అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా GR SET 2026 స్కాలర్‌షిప్ ఎగ్జామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఉచిత UPSC సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందించనున్నారు. అలాగే ఇతర ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఫీజు రాయితీలు కూడా కల్పించనున్నట్లు అకాడమీ తెలిపింది.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సివిల్ సర్వీసెస్‌లో కెరీర్ సాధించాలనుకునే మహిళా అభ్యర్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతిభను గుర్తించి సరైన మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

GR SET 2026 పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, విశ్లేషణ సామర్థ్యం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయని సమాచారం. ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక మెంటార్షిప్, స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్ కూడా అందించనున్నారు.

అభ్యర్థులు అకాడమీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్హత ప్రమాణాలు, పరీక్ష తేదీలు, ఇతర వివరాలను ముందుగా పరిశీలించుకోవాలని సూచించారు.

మహిళల విద్య, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.