తన కుమారుడు విజయ్ రాజకీయ ప్రయాణంపై స్పందించిన ఆయన తల్లి శోభ, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంపై విజయ్ ఎప్పుడూ స్పష్టమైన ఆలోచనతో ఉంటారని తెలిపారు.
“ప్రజలకు ఏమి ఇవ్వాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలి అనే విషయంలో విజయ్‌కు ఎప్పుడూ స్పష్టత ఉంది. సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఆయన ఆలోచన ప్రజల సంక్షేమం చుట్టూనే తిరుగుతుంది. అయితే రెండు రంగాల్లో ఒకేసారి కొనసాగడం సాధ్యం కాదని ఆయన నమ్మకం. సినిమానా, రాజకీయాలా అనే విషయంలో ఏదో ఒకదానికే పూర్తిగా అంకితం కావాలని భావిస్తారు” అని శోభ అన్నారు.
సినీ రంగంలో ఉన్న సమయంలో విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టలేదని, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితమయ్యారని ఆమె పేర్కొన్నారు. “ప్రజల కోసం విజయ్ చేసిన త్యాగం ఇదే. వ్యక్తిగత కెరీర్ కంటే ప్రజల సేవకే ప్రాధాన్యత ఇచ్చారు” అని చెప్పారు.
టీవీకే విజయంపై స్పందిస్తూ, “ఇది కేవలం విజయ్‌కే కాదు, మా కుటుంబానికి కూడా ఎంతో విలువైన కానుక. విజయ్ తీసుకురావాలనుకుంటున్న కొత్త రాజకీయ సంస్కృతి, ప్రజా పాలనకు ఇది నాంది. ఆయన నాయకత్వంలో ప్రజలకు జరిగే మేలు, అభివృద్ధిని చూడాలని మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని శోభ తెలిపారు.












