QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027 విడుదలయ్యాయి. ప్రపంచ టాప్-200 యూనివర్సిటీల జాబితాలో భారత్‌కు చెందిన కేవలం మూడు విద్యాసంస్థలకే స్థానం దక్కింది.

దేశంలో నంబర్-1గా నిలిచిన IIT Delhi ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానాన్ని సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఐదు స్థానాలు మెరుగుపరుచుకుంది. IIT Bombay 134వ ర్యాంక్‌తో రెండో స్థానంలో నిలవగా, IIT Madras 170వ ర్యాంక్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

టాప్-200లో భారత్ నుంచి కేవలం మూడు యూనివర్సిటీలే చోటు సంపాదించడం గమనార్హం. ఇక IIT Kharagpur 205వ స్థానంలో ఉండగా, Indian Institute of Science మరియు IIT Kanpur 221వ స్థానంలో నిలిచాయి.

రిసెర్చ్ ఇంపాక్ట్, అకడమిక్ ప్రతిష్ఠ, అంతర్జాతీయ గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు వంటి ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, Massachusetts Institute of Technology వరుసగా 15వ ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రెండో స్థానంలో Imperial College London, మూడో స్థానంలో Stanford University నిలిచాయి. ఆ తర్వాత University of Oxford, Harvard University స్థానాలు దక్కించుకున్నాయి.