దేశంలో టోల్ వసూళ్ల విధానంలో కీలక మార్పుకు నాంది పలికింది. ముంబై–ఢిల్లీ జాతీయ రహదారి NH-48పై, సూరత్ సమీపంలోని చోర్యాసి టోల్ ప్లాజాలో దేశంలోని తొలి బ్యారియర్-ఫ్రీ టోల్ సిస్టమ్‌ను ప్రారంభించారు.
మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ విధానం ద్వారా వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా నేరుగా ప్రయాణించవచ్చు. వాహనం సమీపంలోకి రాగానే ఫాస్ట్ ట్యాగ్ మరియు నెంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టమ్ ద్వారా టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి.
ఈ సాంకేతికతతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.









