మధ్యప్రదేశ్‌లో గురువారం జరిగిన నాటు పడవ ప్రమాదంఓ హృదయ విదారక దృశ్యాన్ని కళ్లముందుంచింది. బర్గి రిజర్వాయర్‌లో బోటు షికారుకు వెళ్లిన దశలో పెనుగాలులు పడవ బోల్తాకు దారితీశాయి. ఈ దశలో ఓ తల్లి పడవ ఊగిసలాట దశలో , ఇక మునక తప్పదని తెలిసినా చివరి వరకూ తన నాలుగేండ్ల కొడుకు ప్రాణాలను రక్షించాలని తాపత్రయపడింది. బాబును గట్టిగా హత్తుకుంది. ఇద్దరూ ఒకే లైఫ్ జాకెట్‌లో శవాలుగా మరుసటి రోజు గాలింపు చర్యల దశలో దొరికారు. బిడ్డ కోసం తల్లి పడ్డ ఆరాటం, కబళించిన నీటి కెరటాల నడుమ ఆమె బిడ్డ కోసం జరిపిన తుది పోరాటం గుర్తుకొచ్చేలా వీరి చివరి దశ ఉంది. ఈ జంట శవాలను చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీటి పర్యంతం అయింది. అక్కడ సహాయక చర్యల పర్యవేక్షణలో ఉన్న రాష్ట్ర మంత్రి ఒకరు ఈ తల్లి కొడుకుల దీన స్థితి చూపి చలించిపోయాడు. కన్నీరు దిగమింగుకునేందుకు తల్లడిల్లాల్సి వచ్చింది.