
దేశంలో తొలిసారిగా అడ్డంకులు లేని టోల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు గుజరాత్‌లోని ఎన్‌హెచ్ 48పై సూరత్ బహరూచ్ సెక్షన్‌లో ఇటువంటి వ్యవస్థ ఛోరాయాసి టోల్ ప్లాజా వద్ద అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే మంత్రి సామాజిక మాధ్యమంలో స్పందించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మనం దేనినైనా సాధించుకోవచ్చు. ఎటువంటి అవాంతరాలకు వీల్లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు ఈ కొత్త విధానం తీసుకువచ్చారు. ఇప్పుడు తీసుకువచ్చిన ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్‌తో ప్రయాణ కాలం తగ్గుతుంది. హైవేలపై రద్దీ తగ్గుతుంది,. ఇంధన సామర్థం పెరుగుతుంది. టోల్ నిర్వహణ దాదాపుగా మానవ రహిత ఆపరేషన్ల ద్వారానే సాగుతుందని వివరించారు. వాహన ఉద్గారాల వ్యాప్తి కూడా తగ్గుతుంది. పౌరులకు సరైన వాహన వెసులుబాటు కల్పించడం కీలకం.











