
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నందుకే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరగకుండా కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మ హేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బిఆర్‌ఎస్ ఉని కి కాపాడుకునే పనిలో నిమగ్నమైందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. కె సిఆర్‌కు కుమార్తె కవిత పెట్టిన కుంపటితో డాటర్ స్ట్రోక్ తగిలి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చార ని అన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దైర్యం కెసిఆర్, కెటిఆర్‌కు లేదన్నారు. ప్రజ ల సంక్షేమమే పరమావధిగా ఒక లక్షంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన తెలిపారు. పదేళ్లలో మీరు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్‌లు ఎన్ని అని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్‌లపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కెసిఆర్ కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వాటాల పంపకాల్లో తేడా వల్లే కవిత టిఆర్‌ఎస్ పార్టీని స్థాపించిందని ఆయన వివరించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి టి. హరీష్ రావు తన పాత్ర ఏమీ లేదని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సినీ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరేనని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. విద్య వైద్యం పథకాలకు తమ ప్ర భుత్వం విడుదల చేస్తున్న నిధులతో మీరు అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసిన నిధులతో బేరీ జు వేసుకోవాలని ఆయన హరీష్ రావునుద్ధేశించి అన్నారు. తమ ప్రజా పాలన పట్ల అన్ని వర్గాల ప్ర జలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. బిఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇ ప్పు డు ఆ పార్టీ సభలు పెట్టినా ప్రయోజనం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
కార్మికులు లేకపోతే ప్రపంచం లేదు
ఇదిలాఉండగా అంతకుముందు మే-డే సందర్భం గా గాంధీ భవన్‌లో ఏర్పాటైన సభలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ కార్మికు లు అంటే బానిసలు కాదన్నారు. కార్మికులు అం టే వెట్టి చాకిరి చేసే వారు కాదన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదని ఆయన తెలిపారు. కా ర్మికుల హక్కుల కోసం తమ పార్టీ ఎంతో చేసిందన్నారు. ఎనిమిది గంటల పని విధానం అమలు చే యడంలో నెహ్రూ పాత్ర ఉందని ఆయన వివరించారు. కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ అనే క చట్టాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల గొంతు కోస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్ర భుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆ యన విమర్శించారు. కార్మికుల హ క్కులకు భం గం వాటిల్లితే తమ ప్రభుత్వం సహించదని మహే ష్ కుమార్ గౌడ్ తెలిపారు.








