అమెరికాలోని గ్రీన్‌విల్లేలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ గ్రీన్‌విల్లే ఆధ్వర్యంలో ప్రత్యేక వనభోజనాల కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 20న సౌత్ సైడ్ పార్క్ షెల్టర్స్, డిస్కవరీ ఐలాండ్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తెలుగు కుటుంబాలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని... ఫన్, ఫుడ్, ఫెలోషిప్‌తో సందడిగా గడిపేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ప్రకృతి ఒడిలో సరదాగా గడిపేందుకు ఈ కార్యక్రమం మంచి వేదికగా నిలవనుంది.

ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందుగా రిజిస్టర్ చేసుకునే వారికి పరిమిత సంఖ్యలో కాంప్లిమెంటరీ వాటర్ పార్క్ టికెట్లు అందించనున్నారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఈ కమ్యూనిటీ వేడుకలో పాల్గొని... ఆటలు, ఆహారం, ఆత్మీయ కలయికతో ఆనందంగా గడపాలని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ గ్రీన్‌విల్లే సభ్యులు పిలుపునిచ్చారు.

tgg.png