అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. టాంపా బే ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడటంతో కలకలం రేగింది. ఈ అవశేషాలు కనిపించకుండా పోయిన పీహెచ్‌డీ విద్యార్థిని నాహిదా బ్రిస్టీకి సంబంధించినవిగా అనుమానిస్తున్నారు.

ఏప్రిల్ 2026లో నాహిదా బ్రిస్టీ మరియు మరో విద్యార్థి జామిల్ లిమోన్ అదృశ్యమయ్యారు. తరువాత లిమోన్ మృతదేహం హోవర్డ్ ఫ్రాంక్‌లాండ్ బ్రిడ్జ్ సమీపంలో లభించింది. ఈ కేసులో కీలక మలుపుగా, వారి రూమ్మేట్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు.

Missing-Grad-Students-Florida.jpg

కోర్టు పత్రాల ప్రకారం, నిందితుడు శరీరాన్ని ఎలా తొలగించాలనే విషయంపై ఆన్‌లైన్‌లో శోధించినట్లు సమాచారం. తాజా గా లభించిన మానవ అవశేషాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ఘటన అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయ విద్యార్థులలో, ముఖ్యంగా దక్షిణాసియా సమాజంలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.