అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు న్యూజెర్సీతో పాటు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. లక్షలాది మంది ప్రజలు ఈ చారిత్రాత్మక వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాత్రి వేళ ఆకాశాన్ని రంగురంగులుగా మార్చిన భారీ ఫైర్‌వర్క్స్ సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. మరోవైపు అత్యాధునిక ఫైటర్ జెట్లు, మిలిటరీ విమానాల గ్రాండ్ ఫ్లైఓవర్లు వేడుకలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దేశభక్తి గీతాలు, జెండాల రెపరెపలు, లేజర్ లైట్ షోలు, ప్రజల హర్షధ్వానాలతో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా ముగిశాయి.

న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ వరకు... కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు... అమెరికా అంతా ఒకే సంబరంలో మునిగిపోయింది!