ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఏఐ పరిశోధకుడు ఆండ్రేజ్ కార్పతి ఇప్పుడు ఆంథ్రోపిక్‌లో చేరారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. “ఎల్ఎల్ఎంల భవిష్యత్తు రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లోకి రావడం ఆనందంగా ఉంది” అని కార్పతి తెలిపారు.
ఓపెన్‌ఏఐను స్థాపించిన తర్వాత ఆయన Tesla లో ఏఐ డైరెక్టర్‌గా పనిచేశారు. టెస్లా ఆటోపైలట్‌కు సంబంధించిన కంప్యూటర్ విజన్ టీంను ఆయన నడిపించారు. తర్వాత తిరిగి ఓపెన్‌ఏఐలో కొంతకాలం పనిచేసి, ‘యూరేకా ల్యాబ్స్’ అనే ఏఐ ఎడ్యుకేషన్ స్టార్టప్‌ను ప్రారంభించారు.
ఇప్పుడు ఆంథ్రోపిక్‌లో చేరడం ద్వారా ఏఐ రంగంలో పోటీ మరింత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రముఖ ఏఐ పరిశోధకులను ఆకర్షించడంలో ఆంథ్రోపిక్ వేగంగా ముందుకు సాగుతోంది.















