అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొన్ని కొత్త H-1B వీసా పిటిషన్లకు $1 లక్ష చెల్లించాల్సిన నిబంధనను మరో 12 నెలల పాటు పొడిగించారు. 2025 సెప్టెంబర్‌లో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ నిబంధన తాజాగా 2027 సెప్టెంబర్ 21 వరకు కొనసాగనుంది.
అమెరికా వెలుపల ఉన్న H-1B ఉద్యోగుల కోసం యజమానులు దాఖలు చేసే పిటిషన్లకు ఈ చెల్లింపు నిబంధన ప్రధానంగా వర్తిస్తుంది. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమని ప్రభుత్వం భావించిన సందర్భాల్లో పరిమిత మినహాయింపులు ఇవ్వవచ్చు. ఇప్పటికే H-1B వీసా కలిగి ఉన్నవారికి వారి ప్రస్తుత వీసాలు లేదా రెన్యువల్స్‌పై ఈ కొత్త చెల్లింపు నిబంధన వర్తించదు.
అయితే ఈ $1 లక్ష చెల్లింపు నిబంధనపై అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయి. గతంలో ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ ఫీజును చట్టవిరుద్ధంగా పేర్కొంటూ తీర్పు ఇచ్చారు. ఆ నిర్ణయంపై అప్పీల్ ప్రక్రియ కొనసాగుతోంది.














