అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ ఇన్‌ఫ్లేషన్‌ను నియంత్రించేందుకు 2027 ఫాల్ సెమిస్టర్ నుంచి కఠినమైన గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో A గ్రేడ్‌లు సాధారణంగా కేవలం 20 శాతం విద్యార్థులకే పరిమితం కానున్నాయి. అయితే ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనంగా నాలుగు A గ్రేడ్‌లు ఇవ్వడానికి అధ్యాపకులకు స్వల్ప స్వేచ్ఛ ఉంటుంది.
ఎలైట్ యూనివర్సిటీల్లో అధికంగా A గ్రేడ్‌లు ఇవ్వడం వల్ల అసలు ప్రతిభను గుర్తించడం కష్టమవుతోందన్న విమర్శల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చలకు తెరదించుతూ, విద్యా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలనే లక్ష్యంతో హార్వర్డ్ ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
















