అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరానికి కొత్త మేయర్‌గా మార్క్ హిల్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. నగర సిటీ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి మేయర్‌గా తన పదవీకాలాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు వేదికపై ఉండగా, సిటీ కౌన్సిల్ సభ్యులు, నగర అధికారులు, పలువురు కమ్యూనిటీ నాయకులు హాజరై అభినందనలు తెలిపారు.
జూన్ 13న జరిగిన ప్రత్యేక రన్‌ఆఫ్ ఎన్నికల్లో ఫ్రిస్కో ప్రజలు మార్క్ హిల్‌కు స్పష్టమైన మెజారిటీతో విజయం అందించారు. దీంతో ఆయన 2029 వరకు ఫ్రిస్కో మేయర్‌గా సేవలందించనున్నారు.
ఫ్రిస్కో అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాంటి నగరానికి కొత్త మేయర్‌గా మార్క్ హిల్ బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది. ఆయన నాయకత్వంలో ఫ్రిస్కో మరింత అభివృద్ధి సాధిస్తుందనే ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
















