ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ అయిన మెటా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈ వారం సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాదిలో మరిన్ని లేఆఫ్స్ కూడా ఉండొచ్చని సమాచారం. అదే సమయంలో AI అభివృద్ధిపై దృష్టి పెట్టిన మెటా, సుమారు 7 వేల మంది ఉద్యోగులను కొత్త AI ప్రాజెక్టులకు బదిలీ చేయనుంది. కంపెనీలో చిన్న టీమ్‌లతో వేగంగా పనిచేసేలా నిర్మాణ మార్పులు చేపడుతోంది. ప్రస్తుతం మెటాలో సుమారు 78 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇక వరుస లేఆఫ్స్‌లతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగ కోతల ముందు కంపెనీ వాతావరణం “డూమ్స్‌డే”లా మారిందని మాజీ ఉద్యోగి అడెల్ వూ వ్యాఖ్యానించారు. మౌస్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఉద్యోగుల పనితీరును గమనించి AI ట్రైనింగ్‌కు ఉపయోగిస్తున్నారంటూ ఉద్యోగులు నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు








