టీమిండియా మాజీ సెలెక్టర్, మాజీ వికెట్‌కీపర్ Saba Karim 2027 వన్డే ప్రపంచకప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ స్థానం దాదాపు ఖాయమని, అతని ఫిట్‌నెస్, నిలకడైన ప్రదర్శనలు, ఆటపై ఆకలి ఇప్పటికీ అదే స్థాయిలో ఉన్నాయని చెప్పారు.

అయితే రోహిత్ శర్మకు మాత్రం 2027 వరల్డ్‌కప్ వరకు జట్టులో స్థానం నిలబెట్టుకోవాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం కోహ్లీ 2027 వరల్డ్‌కప్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, జట్టుకు విలువ జోడించగలననే నమ్మకం ఉంటేనే ఆ టోర్నీలో ఆడతానని ఇటీవల పేర్కొన్నాడు.