ఫుట్‌బాల్ అంటే ఎంత ఇష్టం ఉంటే ఇలా చేస్తారు? అమెరికాకు చెందిన ఓ ఫుట్‌బాల్ అభిమాని FIFA వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఏకంగా రూ.9 లక్షలు ఖర్చు చేశాడు.
మూడు సార్లు FIFA టికెట్ లాటరీలో ప్రయత్నించినా టికెట్ దక్కకపోవడంతో చివరకు 10,925 డాలర్లు (సుమారు రూ.9 లక్షలు) పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. ఈ మొత్తం అతని నాలుగు నెలల జీతానికి సమానం.
అంతేకాదు.. ఈ టికెట్ కోసం యూరప్ ట్రిప్, లగ్జరీ క్రూయిజ్ ప్లాన్‌లను కూడా వదులుకున్నాడు.
ఫుట్‌బాల్ తన జీవితంలో విడదీయరాని భాగమని చెప్పిన అతను, "ఇది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. ఎంత ఖర్చైనా సరే ఫైనల్ చూడాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపాడు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ టికెట్ కోసం అవసరమైన డబ్బును అతను అంటార్కిటికాలోని మెక్‌మర్డో స్టేషన్‌లో ఐదు నెలలు పనిచేసి సంపాదించాడు. ఆ ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వరల్డ్ కప్ టికెట్‌కే ఖర్చు చేశాడు.
క్రీడలపై అభిమానులు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారో ఈ ఘటన మరోసారి నిరూపించింది.











