ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగే కీలక గ్రూప్-డి మ్యాచ్‌కు స్టార్ ఫార్వర్డ్ క్రిస్టియన్ పులిసిక్ దూరమయ్యాడు. కాలి కండరాల గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్‌లో ఆడలేడని అమెరికా హెడ్ కోచ్ మారిసియో పోచెట్టినో ప్రకటించారు.
పరాగ్వేపై అమెరికా 4-1 తేడాతో గెలిచిన తొలి మ్యాచ్‌లో పులిసిక్ గాయపడగా, హాఫ్‌టైమ్‌లోనే మైదానం వీడాడు. ప్రస్తుతం అతడు శిక్షణలో పాల్గొంటున్నప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని కోచ్ తెలిపారు.
అతడి కోలుకునే ప్రక్రియ సానుకూలంగా సాగుతోందని, త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడని పోచెట్టినో ఆశాభావం వ్యక్తం చేశారు.
సియాటిల్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశం ఉంది. దీంతో అమెరికా-ఆస్ట్రేలియా పోరు ఆసక్తికరంగా మారింది.













