న్యూజెర్సీ స్టేడియంలో ఫ్రాన్స్, సెనెగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి ఇరు జట్లు గోల్ చేయకుండా 0-0తో సమంగా నిలిచాయి. కైలియన్ ఎంబాప్పే, బాలన్ డి'ఓర్ విజేత ఉస్మాన్ డెంబెలే, మైఖేల్ ఒలిసే వంటి స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
అయితే సెనెగల్ రక్షణ కట్టుదిట్టంగా నిలిచి ఫ్రాన్స్ దాడులను అడ్డుకుంది. 2002 ప్రపంచకప్‌లో సెనెగల్ చేతిలో ఎదురైన షాకింగ్ ఓటమిని మరిచిపోకుండా ఈసారి విజయం సాధించాలని ఫ్రాన్స్ భావిస్తోంది. గత ఏడు ప్రపంచకప్‌లలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్, మరో విజయవంతమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టాలని చూస్తోంది.










