18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి IPL టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఇప్పుడు వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుని కొత్త యుగానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది.
ఈ సీజన్‌లో RCB అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. క్వాలిఫయర్-1లో బ్యాటర్లు మెరిసితే, ఫైనల్లో బౌలర్లు మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ముఖ్యంగా హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బోబాట్ అమలు చేసిన వ్యూహాలు జట్టుకు విజయాన్ని అందించాయి.
2025లో కెప్టెన్‌గా నియమితుడైన రజత్ పాటిదార్ ఎంపిక అప్పట్లో ఆశ్చర్యం కలిగించినా, ఇప్పుడు అది మాస్టర్‌స్ట్రోక్‌గా మారింది. స్టార్ ఆటగాళ్ల కంటే జట్టు లక్ష్యాలకే ప్రాధాన్యం ఇచ్చిన పాటిదార్ నాయకత్వం ఫలితాన్నిచ్చింది. ఈ సీజన్‌లో 501 పరుగులు చేసి, క్వాలిఫయర్-1లో కేవలం 33 బంతుల్లో 93* పరుగులతో జట్టును ఫైనల్‌కు చేర్చిన ఆయన, RCB విజయగాథలో కీలక పాత్ర పోషించాడు.
వరుసగా రెండు టైటిళ్లతో RCB ఇప్పుడు CSK, MI తరహాలో దీర్ఘకాల ఆధిపత్యానికి పునాది వేసిందనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.








