ఇది క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే విషయం. ఇండియాలోనే భారత్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది ఆఫ్ఘనిస్తాన్!

అవును.. సెప్టెంబర్‌లో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ హోమ్ టీమ్‌గా వ్యవహరించనుంది. కానీ మ్యాచ్‌లు మాత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న భద్రతా, రాజకీయ పరిస్థితుల కారణంగా గత పదేళ్లుగా తమ హోమ్ మ్యాచ్‌లను భారత్, యూఏఈల్లో నిర్వహిస్తోంది. గతంలో గ్రేటర్ నోయిడా, డెహ్రాడూన్ వేదికలుగా నిలిచాయి.

ఇప్పుడు తొలిసారి భారత్‌తో సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. సెప్టెంబర్ 13, 16, 19 తేదీల్లో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.