ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా వరల్డ్‌కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మెక్సికో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు, భారీ వరల్డ్‌కప్ ట్రోఫీ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెక్సికన్ పాప్ బ్యాండ్ మనా, లాస్ ఏంజెల్స్ అజులెస్, కొలంబియా స్టార్ జే బల్విన్ తమ సంగీతంతో అభిమానులను ఉర్రూతలూగించారు.
అనంతరం ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని షకీరా, నైజీరియన్ గాయకుడు బర్నా బాయ్‌తో కలిసి అధికారిక వరల్డ్‌కప్ గీతం ‘డాయి డాయి’ను ఆలపించి స్టేడియాన్ని ఉత్సాహంతో నింపారు. ప్రారంభ వేడుకల అనంతరం మెక్సికో–దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవడంతో ఫుట్‌బాల్ మహాసంగ్రామానికి తెరలేచింది.











