తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దిండిగల్ డ్రాగన్స్ అదరగొట్టింది. శుక్రవారం NPR కాలేజ్ గ్రౌండ్‌లో దిండిగల్ డ్రాగన్స్, సేలం స్పార్టన్స్ మధ్య జరిగిన 15 ఓవర్ల మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత డ్రాగన్స్ బ్యాటర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు.
మొదట బ్యాటింగ్ చేసిన దిండిగల్ డ్రాగన్స్‌కు ఓపెనర్లు శివమ్ సింగ్, వి.కె. వినీత్ శుభారంభం అందించారు. కేవలం నాలుగు ఓవర్లలోనే 70 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ బి. ఇంద్రజిత్, విమల్ కుమార్ కలిసి స్పార్టన్స్ బౌలర్లపై దాడి చేశారు. నాలుగో వికెట్‌కు కేవలం 24 బంతుల్లో 62 పరుగులు జోడించారు.
కెప్టెన్ ఇంద్రజిత్ అయితే విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, ఏకంగా 8 సిక్సర్లు ఉన్నాయి. హున్నీ సైనీతో కలిసి 13వ ఓవర్‌లోనే 32 పరుగులు రాబట్టడంతో డ్రాగన్స్ స్కోరు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
చివరికి దిండిగల్ డ్రాగన్స్ 15 ఓవర్లలో 6 వికెట్లకు 239 పరుగుల భారీ స్కోరు చేసింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సేలం స్పార్టన్స్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
దీంతో దిండిగల్ డ్రాగన్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ ఇంద్రజిత్ విధ్వంసక బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.












