ఐపీఎల్ 2026లో అద్భుతమైన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి, 12 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన దగ్గరే ఉంచుకున్నాడు.
ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వైభవ్‌ను తమ జట్టులోకి తీసుకురావడానికి ముంబైలో రూ.30 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను గిఫ్ట్‌గా ఆఫర్ చేసిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ వార్తపై భారీ చర్చ నడుస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ క్లెయిమ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ముంబై ఇండియన్స్ లేదా వైభవ్ కుటుంబం నుంచి కూడా ఎలాంటి ధృవీకరణ రాలేదు. దీంతో ఇది సోషల్ మీడియాలో పుట్టిన రూమర్ మాత్రమేనని స్పష్టమవుతోంది. అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ టాలెంట్, అతని పేలవ బ్యాటింగ్ స్టైల్ కారణంగా భవిష్యత్తులో పెద్ద ఫ్రాంచైజీలు అతడిపై కన్నేయడం మాత్రం ఖాయం అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.












